మెదక్/ గజ్వేల్, జూలై 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆకలికి అన్నం వేదనకు ఔషధం లాగా ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తున్న గజ్వేల్ ఆపన్న హస్తం సేవా బృందానికి అభినందనలని లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్ రావు అన్నారు. 2017లో ఏర్పడిన ఆపన్న హస్తం ప్రతినెల ఒక్కొక్క సభ్యుడు 200 రూపాయల చొప్పున విరాళం ఇస్తూ ఇప్పటివరకు ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేసే 106 కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు. గజ్వేల్ లోని కోలా అభిరామ్ గార్డెన్ లో జూలై 12 శనివారం జరిగిన ఆపన్న హస్తం సభ్యుల కుటుంబ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా రామ్మోహనరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన గజ్వేల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ.. యువత మద్యం మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్య వారిలో సరైన చైతన్యం తీసుకురావడానికి ఆపన్న హస్తం సంస్థ పని చేయాలని కోరారు. రాసి కంటే వాసి ముఖ్యమని ఆపన్న హస్తం చేస్తున్న సేవా కార్యక్రమాలు మిగతా స్వచ్ఛంద సంస్థలకు స్ఫూర్తినిస్తున్నాయని సరస్వతీ శిశు మందిర్ గజ్వేల్ ప్రధాన ఆచార్యులు,వ్యాఖ్యాత హరిణ పవన్ అన్నారు. సామాజిక దురాచారాల మీద యువతను మేల్కొల్పాలని మరో అతిథి రాష్ట్రపతి జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశ బోయిన నర్సింలు అన్నారు. ఈ కార్యక్రమానికి ఆపన్న హస్తం అధ్యక్షుడు బాలచంద్రం అధ్యక్షత వహించారు. కార్యదర్శి శ్రీనివాస్ ఆపన హస్తం ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాల నివేదిక చదివారు. కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్ ఇప్పటి వరకు ఆపన్న హస్తం అందించిన సేవల జమా లెక్కల ఖర్చులు సభ్యులకు వివరించారు. ఆపన్న హస్తం కుటుంబ సమ్మేళనానికి సుమారు హాజరైన అనేకమంది సభ్యులు తమ సేవా కార్యక్రమాల సమాహారాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆపన్న హస్తం సభ్యులు తమ తమ కుటుంబ సభ్యులతో కలసి సుమారు 300 మంది పాల్గొన్నారు.