సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని రాళ్లకత్వ గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కే.ప్రభాకర్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు, జాతర, డప్పుల వాద్యం, మహిళల బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, ఖదీర్, నరేందర్, శ్రీకాంత్ గౌడ్, కృష్ణ, రామకృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ, జయపాల్ రెడ్డి, పాపయ్య, ఆంజనేయులు, మహేష్, నవీన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాళ్లకత్వలో నల్ల పోచమ్మను దర్శించుకున్న చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
Published On: July 14, 2025 7:24 pm