ఆషాఢ మాస బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మాదిరి పృథ్వీరాజ్

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 20 (ప్రశ్న ఆయుధం న్యూస్):పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్ పూర్ మండలం లింగమయ్య కాలనీ, రామచంద్రపురంలోని కాచిరెడ్డిపల్లి, శ్రీనివాస్ నగర్ కాలనీ, ఇంద్రేశం ఆర్.కె నగర్ కాలనీలలో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలలో స్థానిక యువత, ఆలయ నిర్వహకులతో కలిసి యువ నాయకుడు మాదిరి పృథ్వీరాజ్ అమ్మవారిని దర్శించుకున్నారు. రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో సాయిచరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల ఉత్సవాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment