సంగారెడ్డి ప్రతినిధి, జూలై 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తెలంగాణ మైనార్టీ బాలికల పాఠశాల, కళాశాలలో అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.హేమలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2025 -26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ- ఓసి క్యాటగిరిలో 2 , బీసీ కేటగిరీలో 2 మరియు 6 ,7, 8 తరగతిలో ముస్లిం మరియు క్రిస్టియన్ మైనార్టీ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 9 తరగతిలో నాన్ మైనారిటీ బీసీ లో 2 , అర్హత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని అన్నారు. ఇంటర్ ఫస్టియర్ సీఈసీ అండ్ ఎంఈసీ గ్రూపులలో ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ బీసీ కేటగిరీలో 2 అడ్మిషన్లు ఉన్నాయని చెప్పారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన విద్యార్థులు తమ దరఖాస్తులను పాఠశాల, కళాశాల అడ్మిషన్ డెస్క్ లో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులు చివరి తేదీ జూలై 31 వరకు స్వీకరించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ హేమలత తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్ ఫోటోలు అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మొబైల్ నెంబర్ 7331170817ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.
సంగారెడ్డి మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: మైనార్టీ బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ హేమలత
Published On: July 23, 2025 6:32 pm