యువతకు స్ఫూర్తి చంద్రశేఖర్ అజాద్

ఎర్రపప్పుతో ఆజాద్ చిత్రం వేసిన రామకోటి రామరాజు

మెదక్/గజ్వేల్, జూలై 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): మీ నరాల్లో రక్తం మరగకపొతే మీ నరాల్లో ప్రవహించేది రక్తం కాదు నీళ్లు అన్న చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఎర్రపప్పు గింజలను ఉపయోగించి ఆజాద్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించి దేశభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు, రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ అంటే చరిత్ర కాదు భారతీయ యువత త్యాగాలకు ప్రతిరూపం అన్నారు. స్వరాజ్యేచ్ఛతో 15 ఏళ్ళ వయసులోనే స్వతంత్ర సంగ్రామంలోకి అడుగిడి చంద్రశేఖర్ ఆజాద్. మారి, 24 ఏళ్ళ వయసులోనే దేశం కోసం అమరుడైన ఆ మహనీయుని బాటలో నడవాలన్నారు

Join WhatsApp

Join Now