ఎన్నో విశిష్టతలు కలిగిన మాసం శ్రావణమాసం: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

*నెల రోజుల పాటు భగవన్నామ స్మరణలో గడుపుదాం*

మెదక్/గజ్వేల్, జూలై 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుందని నెల రోజుల పాటు భగవన్నామ స్మరణతో ప్రతి దేవాలయం మరుమ్రోగుతుందని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. శుక్రవారం నాడు గజ్వేల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ.. శ్రావణమాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని పూజలు నోములలో భక్తులు మునిగి తేలుతారన్నారు. శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ మాసాన్ని “నభో మాసం” అని కూడా అంటామని, నభో అంటే ఆకాశం అని అర్ధం అన్నారు. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవన్నారు. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి, పుత్రాదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరహ జయంతి, హయగ్రీవ జయంతి ఇలా అనేక పండుగలు వస్తాయని ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న మాసం ఈ శ్రావణమాసం అని అన్నారు.

Join WhatsApp

Join Now