సంగారెడ్డి ప్రతినిధి, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): జోగిపేట, వట్ పల్లి పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిశుభ్రత, స్టేషన్ రికార్డుల మెయింటెనెన్స్ పరిశీలించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలని, ప్రతి ఫిర్యాదును క్లుప్తంగా విచారణ చేపట్టాలని అన్నారు. ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సందేహాలున్న ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్.హెచ్.ఓలకు సూచనలు చేశారు. సిబ్బంది ప్రతి ఒక్కరు అన్నిరకాల విధులను చేయగలిగే విధంగా, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని/ ఆధునిక సాంకేతికతను అందించుకోవాలన్నారు. ప్రతిరోజు విజిబుల్ పోలిసింగ్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన చుట్టూ జరుగుతున్న నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. డయల్-100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలని, తొందరగా నేరస్థలానికి చేరుకున్నట్లయితే నేరం తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నారు. సిబ్బంది, అధికారులు స్టేషన్ హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలని దూరప్రాంతాలకు నుండి ప్రయాణం ప్రమాదకరం అన్నారు. నేరాల నియంత్రణ, జరిగిన నేరాలను ఛేదించడానికి ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.., స్వచ్ఛందంగా సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చేల చూడాలని, డాబాలు, పెట్రోల్ పంపులు, విద్యాసంస్థలలో సిసి కెమెరాల ఏర్పాటు చేసుకునే విధంగా యాజమాన్యాలకు సూచించాలని అన్నారు.
జోగిపేట, వట్ పల్లి పోలీసు స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Published On: July 29, 2025 7:42 pm