ఆగస్టు 2న బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నాను విజయవంతం చేయాలి: బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్

మెదక్/నర్సాపూర్, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ తెలిపారు. బుధవారం నర్సాపూర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించి, హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలులో అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు అందరూ ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు ఇవ్వాలని కోరారు.

Join WhatsApp

Join Now