సంగారెడ్డి/పటాన్‌చెరు, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. “సమాజంలో శాంతి, శ్రేయస్సు, మరియు ప్రజల సంక్షేమానికి ఇలాంటి దేవాలయాలు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న మాదిరి ప్రిథ్వీరాజ్
Published On: July 31, 2025 8:36 pm