భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..
ఆదిలాబాద్ మండలానికి చెందిన కిరణ్ కుమార్(35) కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొద్ది నెలలుగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవపడేవాడు. భార్య పుట్టింటికి వెళ్లి నెల అయిన రాకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం తండ్రి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆత్మహత్యకు కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని భార్య ఫిర్యాదుతో ఏఎస్సై కేసు నమోదు చేశారు.