Site icon PRASHNA AYUDHAM

భిక్నూర్‌లో BRS నేతలకు షాక్… కాంగ్రెస్ లో భారీ చేరిక

IMG 20251128 190507

భిక్నూర్‌లో BRS నేతలకు షాక్… కాంగ్రెస్ లో భారీ చేరిక

షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులతో సహా పలువురు గౌడ్, రెడ్డి సమాజ నేతలు కండువా ధరింపు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 28:

కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన BRS పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్ బాలాగోని రాజా గౌడ్ సహా పలువురు కీలక నాయకులు శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రెడ్డి సంఘం మండల ఉపాధ్యక్షులు సతీష్ రెడ్డి, బండి బాబా గౌడ్, వెంకటస్వామి గౌడ్, స్వామి గౌడ్, రాము గౌడ్, సూరమ్ శ్రీధర్, ధనరాజ్, మెరుపుల గణేష్, కాషాగౌని శ్రీనివాస్, భూషణం, స్వామి ముదిరాజ్, చల్మెడ బాబు తదితరులు కూడా BRS‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ కండువాలను షబ్బీర్ అలీ స్వయంగా కప్పి వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాగిరెడ్డి, సురేందర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఎల్లం రెడ్డి, సత్తయ్య, శ్రీనివాస్, బాలు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version