నిజామాబాద్ జిల్లా తైక్వాండో పోటీలలో విజయాలు సాధించిన ఆర్మూర్ భజరంగ తైక్వాండో అకాడమీ క్రీడాకారులను, కోచ్‌ను ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గోనె లహరి అభినందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్, క్రీడాకారులను, వారి కోచ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారుల కృషిని, అకాడమీ ప్రతిభను కొనియాడారు.
నిజామాబాద్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు ఈ. రాజశేఖర్ మాట్లాడుతూ, అకాడమీ 100% మెడల్స్ సాధించడం గర్వకారణమని, క్రీడాకారుల కఠోర శ్రమ ఫలితమే ఈ విజయం అని తెలిపారు. రాబోయే స్టేట్ లెవెల్ పోటీలలోనూ ఇదే స్ఫూర్తితో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
కోచ్ సాయితేజ్‌ను కూడా ఆయన అభినందించారు. క్రీడాకారులకు జవిద్భాయ్ మినీ స్టేడియంలో నిత్యం శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కరాటే భోజన్న, ఈ అర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం జరిగింది.

