Site icon PRASHNA AYUDHAM

మృత్యువుతో పోరాడి ఓడిన యువతి!

IMG 20250127 WA0029

*మృత్యువుతో పోరాడి ఓడిన యువతి!*

రాజమండ్రి, జనవరి 27:

రాజమండ్రిలో బుధవారం తెల్లవారు జామున వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్‌ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. 28 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈల్లా దీక్షిత (22) అనే యువతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. సుజాత నగర్‌కు చెందిన దీక్షిత, మర్రిపాలెనికి చెందిన ఆమె బంధువు కల్యాణి.. ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ నిమిత్తం విశాఖ నుంచి హైదరా బాద్‌కు కావేరి ట్రావెల్స్‌ బస్‌లో జనవరి 22న బయలుదేరారు.

రాజమండ్రి వద్దకు వెళ్లేసరికి బస్‌ ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది.ఈ ప్రమాదం లో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ప్రమాదంలో గాయపడిన దీక్షితను నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది..

అప్పటి నుంచి నాలుగు రోజుల పాటు మృత్యువు తో పోరాడిన దీక్షిత ఆదివా రం రాత్రి మరణించింది. దీంతో దీక్షిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రుగా విలపించారు. ఇక ఇంతటి ప్రమాదానికి కారణ మైన కావేరి ట్రావెల్స్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Exit mobile version