విదేశంలో సంగారెడ్డి లయన్స్ క్లబ్ ఆదర్శకు ప్రశంసలు

IMG 20250629 121239
సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 29(ప్రశ్న ఆయుధం న్యూస్): అమెరికా పర్యటనలో భాగంగా జోన్ చైర్మన్ లయన్ మంగళపర్తి వెంకటేశం ఉత్తర అమెరికా (యూఎస్ఏ) దేశంలో ఉత్తర కారోలిన రాష్ట్రంలో దుర్హం కౌంటీ లయన్స్ డిస్ట్రిక్ట్ 31-Oలోని (దుర్హం లయన్స్ క్లబ్)ను సందర్శించారు. లయన్స్ క్లబ్ ఆప్ సంగారెడ్డి ఆదర్శ నిర్వహిస్తున్న విద్య, వైద్య, పర్యావరణ కార్యక్రమాలను వివరించారు. యూఎస్ఏలో లయన్స్ క్లబ్ ల సేవా కార్యక్రమాలు 5 గ్లోబల్ కారకాలు మధుమేహం, విజన్, హంగర్, ఎన్విరాన్మెంట్, ఛైల్డ్ హుడ్ క్యాన్సర్ స్థానిక పాఠశాలలలోని విద్యార్థులకు (ఐ విజన్) కంటి చూపు, అందత్వము, ఎన్విరాన్మెంట్ (పర్యావరణం)లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దృష్టి, వినికిడి లోపం ఉన్నవారికి గుర్తించి సహాయం చేయడానికి అంతర్జాతీయ, రాష్ట్ర, జిల్లా 31-O ప్రాజెక్టులకు సహకరించడం వంటి కార్యక్రమాలు దుర్హం క్లబ్ ఆదర్శం అని అన్నారు.2025-26 లయానిస్టిక్ సంవత్సరానికి జరిగిన దుర్హం లయన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో లయన్ వెంకటేశంను క్లబ్ అధ్యక్షురాలు లయన్ కిమ్ టైలర్ సన్మానించి, ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో క్రాగ్ బ్రౌన్, కార్యదర్శి పౌల్ సిల్వర్మాన్, కోశాధికారి జెర్రీ మోనాహన్, జాన్ నార్మెంట్, లైన్ వుడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ చైర్మన్లు పి.రాములు గౌడ్, ఎస్.విజయందర్ రెడ్డి, అనంతరావు కులకర్ణి, డి.హనుమంతుగౌడ్, జార్జ్ మాథ్యూ, యన్. రామప్పలు మంగళపర్తి వెంకటేశంను ప్రత్యేకంగా అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment