సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ భావజాతక నేత, విద్యావేత్త ఆచార్య జయశంకర్ 91వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ పద్మజ రాణి మాట్లాడుతూ… ఆచార్య జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అవుతుందని పిలుపునిచ్చారు. ప్రతీ ఉద్యోగి, పౌరుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పని చేస్తే, అదే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ ఆంథోనీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆచార్య జయశంకర్ ఆశయాలే స్ఫూర్తి: డీఆర్ఓ పద్మజ రాణి
Published On: August 6, 2025 12:52 pm