*అచ్చె మురళి సేవలు అమోఘం*
*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 30 ప్రశ్న ఆయుధం*
ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఇల్లందకుంట మండల శాఖ అధ్యక్షుడు అచ్చె మురళి ఉద్యోగ విరమణ సన్మానోత్సవ సభకు హాజరైన పి.ఆర్.టి.యు టి.యస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అయిలేని కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లందకుంట మండల శాఖ అధ్యక్షుడు అచ్చె మురళి గత 36 సంవత్సరాలుగా విద్యారంగానికి ఎనలేని సేవలు చేశారని సంఘ బాధ్యులుగా మండల శాఖ అధ్యక్షుడుగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయ లోకానికి అనేక సేవలు అందించారని కొనియాడారు.ఉద్యోగ విరమణ అనంతర శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అసోసియేట్ అధ్యక్షుడు పాకాల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిప్పని వెంకట్రాజం జమ్మికుంట మండల శాఖ అధ్యక్షుడు పంజాల కృష్ణమూర్తి మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కొక్కుల కేదారీశ్వర్,యాలం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు