నాపై దాడి చేసి డబ్బులు గుంజకున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి

నాపై దాడి చేసి డబ్బులు గుంజకున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 10

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ముందు రాధిక హోటల్ వద్ద నాపై దాడి చేసి నా దగ్గర ఉన్న పదివేల రూపాయలను తీసుకువెళ్లిన వారిని గుర్తించి తనకు న్యాయం చేయాలని లింగంపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన చాకలి సాయిరాం దరఖాస్తు చేశాడని కామారెడ్డి పట్టణ ఎస్హెచ్ఓ శ్రీహరి ఒక ప్రకటనలో

తెలిపారు. ఏమనగా తేదీ 08.08.2025 నా ఉదయం 11 గంటలకు నేను బావి మోటర్ కొనడానికి 10,000 రూపాయలు తీసుకొని కామారెడ్డికి వచ్చినాను, అయితే నేను అనుకున్నటువంటి మోటర్ దొరకనందున తిరిగి నేను ఇంటికి వెళ్లడానికి కామారెడ్డిలో కొత్త బస్టాండ్ సమీపంలో గల రాధిక హోటల్ వద్దకు వచ్చినాను. రాత్రి 10 గంటల 30 నిమిషాలు అయినందున నాకు బస్సులు లేనందున రాధిక హోటల్ ముందు నిలబడి ఉండగా ఒక గుర్తుతెలియని వ్యక్తి నేను నిలుచున్న దగ్గరికి వచ్చి ఆకారణంగా నన్ను అతని వద్ద ఉన్న ఒక ఇనుప రాడుతో చంపుతానని బెదిరించి, నన్ను కింద పడవేసి నా ప్యాంటు జేబులో నుండి పదివేల రూపాయలు తీసుకున్నాడు. అట్టి వ్యక్తికి భయపడి నేను దరఖాస్తు ఇవ్వలేదు కావున శనివారం రాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తున్నాను. కావున పై విషయంలో చట్టపరమైన చర్య తీసుకుని మాకు న్యాయం చేయగలరు ఫిర్యాదు చేసినట్లు ఆయన ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment