సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): నానో యూరియా – రైతు మిత్రుడు, పర్యావరణ సంరక్షకుడు అని వ్యవసాయ జిల్లా అధికారి శివప్రసాద్ అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ, ఇఫ్కో ఆధ్వర్యంలో మంగళవారం చౌటుకూరు మండల కేంద్రంలోని రైతులతో నానో యూరియా వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న నానో యూరియా రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. (ఇఫ్కో) సంస్థ ఆధ్వర్యంలో నానో యూరియా తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి, రైతులు నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. నానో యూరియా ప్రస్తుతం రైతుల జీవితాలను మార్చే సాంకేతిక ఆవిష్కరణగా నిలుస్తోంది అన్నారు. నానో టెక్నాలజీ ఆధారంగా తయారైన ఈ ఎరువు వాడకం వల్ల పంట దిగుబడులు పెరుగుతాయి, భూమి సారవంతం అవుతుందన్నారు. రైతుల ఖర్చులు తగ్గుతాయి అన్నారు. నానో యూరియా అనేది యూరియాను నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో తయారు చేసిన ఎరువు. సాధారణ యూరియా, నానో స్థాయిలో (20–50 నానో మీటర్ల పరిమాణం) మార్చి, స్ప్రే రూపంలో వాడేలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
నానో యూరియాతో పర్యావరణానికి ప్రయోజనం: వ్యవసాయ జిల్లా అధికారి శివప్రసాద్
Published On: August 26, 2025 9:01 pm