పటాన్చెరు, జూలై 30
ప్రస్తుత ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రామచంద్రాపురం మండలంలోని వెలిమెల రైతు వేదికలో నిర్వహించిన రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ (RPL) శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ శాస్త్రీయ సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అందిస్తున్న శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏడీఏ మనోహర, రామచంద్రపురం, పటాన్ చెరు వ్యవసాయ అధికారులు ప్రసాద్, శివ కుమార్, ఆత్మ డైరెక్టర్ రోహిణి, ఏఈవోలు రాణి, వయోలా, ఏటీఎంలు స్పందన, సాయి, రోజా, పీఏసీఎస్ సెక్రటరీ బుచ్చి రాములు, రైతులు పాల్గొన్నారు.