Mahabubabad/Narsimhulapet (ప్రశ్న ఆయుధం) జూలై 03
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలోని రైతు కాటిపల్లి రామ్మోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన 8 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్ పామ్ మొక్కల నాటకాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

జిల్లాలో 2022–23 సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు ప్రారంభమైందని, ప్రస్తుతం 885 మంది రైతులు 2,533 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 1,300 ఎకరాల లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటికే 1,000 ఎకరాలకు రైతులను గుర్తించినట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు జిల్లాలో 48 మంది రైతులకు చెందిన 180 ఎకరాల్లో కోత పూర్తై 76 మెట్రిక్ టన్నుల తాజా పండ్ల గుత్తులు (Fresh Fruit Bunches) ఉత్పత్తి కాగా, రైతులు మొత్తం రూ.18,07,508 ఆదాయం పొందినట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా 19 మంది రైతులు 53.83 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు అందిస్తోందన్నారు. ప్రతి ఎకరానికి సుమారు 50 మొక్కలు అవసరమవుతాయని, రైతులు ఒక్కో మొక్కకు కేవలం రూ.20 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అదనంగా నాలుగు సంవత్సరాల పాటు ప్రతి ఎకరానికి ఏటా రూ.4,200 చొప్పున సబ్సిడీ అందిస్తున్నట్లు చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) సంస్థ రైతులకు ప్రతి ఎకరానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని మరింత మంది రైతులు ఆయిల్ పామ్ సాగును చేపట్టి అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతి, ఉద్యానవన శాఖ అధికారులు, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) ప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.