సంగారెడ్డి, జూన్ 30
సంగారెడ్డి, జూన్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): యూరియా యాప్ ను రద్దు చేయాలని, యాప్ తో సంబంధం లేకుండా యూరియా సరఫరా చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి సుందరయ్య భవన్ లో సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. యూరియా యాప్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని అన్నారు. యూరియా యాప్ తో సంబంధం లేకుండా యూరియాను సప్లై చేయాలని డిమాండ్ చేశారు. యూరియా అక్రమంగా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అధిక ధరలకు విత్తనాలు ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
యూరియా యాప్ ను రద్దు చేయాలని, యాప్ తో సంబంధం లేకుండా యూరియా సరఫరా చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి సుందరయ్య భవన్ లో సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యూరియా యాప్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని, యూరియా యాప్ తో సంబంధం లేకుండా యూరియాను సప్లై చేయాలని డిమాండ్ చేశారు. యూరియా అక్రమంగా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అధిక ధరలకు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు రాజయ్య, శ్రీనివాస్, భూషణం తదితరులు పాల్గొన్నారు.












