బీసీ వసతి గృహం వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేసి, వారి కుమారుని కఠినంగా శిక్షించాలి: ఏఐఎస్ఎఫ్ డిమాండ్

సంగారెడ్డి/నారాయణఖేడ్, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో వార్డెన్ శారద కుమారుడు కర్ర రాజేష్ నాయక్ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించినందున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వసతి గృహం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తురెడ్డి మాట్లాడుతూ.. ఓవైపు ప్రభుత్వంపై అధికారులు విద్యార్థి సంఘ నాయకులకు, ప్రింట్ మరియు మీడియాను ప్రవేశం లేదంటూ ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తూ వార్డెన్ కుమారుడు నేరుగా వసతి గృహానికి వెళ్తూ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించి వారిపై చేతులు వేస్తూ దుర్భాషలాడుతున్నందున వారిని ఫోక్సో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మంచి ఉద్దేశంతో హాస్టల్ లో ఉంటూ తమ విద్యార్థులు చదువుకొని బాగు పడతారని చదువుకోవడానికి పంపిస్తే వార్డెన్ కుమారుడు ఈ విధంగా చేయడం దారుణమని అన్నారు. గతంలో కూడా ఈ వార్డెన్ పని చేసిన చోట ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి వార్డెన్ వెంటనే సస్పెండ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఈ విధమైన చర్యలకు వార్డెన్లు ప్రోత్సహించి ఉన్నందునే ప్రభుత్వ వసతులు వాళ్ళు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోకుంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అశోక్, ఏఐఎఫ్డిఎస్ జిల్లా కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment