సంగారెడ్డి, జూలై 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ ను బీఆర్ఎస్ వీ జిల్లా నాయకుడు అఖిల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు అఖిల్ మాట్లాడుతూ.. ఆత్మస్థైర్యంతో అంకితభావంతో వ్యాధిగ్రస్థులను ప్రజలకు నిస్వార్థంగా సేవలందించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కు పుష్పగుచ్ఛం అందజేసిన అఖిల్
Published On: July 1, 2025 6:54 pm
