అఖిల భారత ఓబీసీ 10 వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 01 ప్రశ్న ఆయుధం
ఈ నెల ఆగస్టు 7వ తేదీన గోవా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్ జన్మదినాన్ని పురస్కరించుకుని అఖిలభారత ఓబీసీ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు మోతుకూరి శ్రీనివాస్ అన్నారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో గల గరుడ చౌరస్తాలో స్థానిక బీసీ సంక్షేమ నాయకులతో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ కలిసి అఖిలభారత ఓబిసి మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు మండలంలోని బీసీ సంక్షేమ నాయకులు బీసీ కులాల సంఘ నాయకుడు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని శ్రీనివాస్ కోరారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కారింగుల రాజేందర్, ప్రధాన కార్యదర్శి జంపాల రితేష్, కోశాధికారి చింతల కౌశిక్, తోట రాజు,గుండారపు సాయి, మురహరి రాజు, సమ్మేట రామక్రిష్ణ, రౌతు రాజు, నల్లగొండ రాజు, బోయ చంద్రయ్య, మధుకర్, గోవర్ధన్, శ్రావణ్, రాజు, రవీందర్, శ్రీకాంత్, వంశీ, హరిక్రిష్ణ, రమేష్ లు తదితరులు పాల్గొన్నారు.