సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో వేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (నేషనల్ డి వార్మింగ్ డే)ను పురస్కరించుకొని పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ (నేషనల్ డి వార్మింగ్ డే) కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. నులిపురుగుల కారణంగా పిల్లల ఎదుగుదలలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. నులిపురుగుల నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 11వ తేదీన ( నేషనల్ డి వార్మింగ్ డే) ను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒక సంవత్సరం వయస్సు నుండి ఒక సంవత్సరం వయసు నుండి 19 వారందరికీ వయసులోపు వారందరికీ నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వైద్యులు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఈరోజు ఆగస్టు 11 జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, అంగన్వాడి కేంద్రాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో ఒకటి నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్రను చూర్ణం చేసి నీటిలో గాని పాలలో గాని కలిపి మాత్రలు వేసుకునేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు సంవత్సరాల వారికి ఒక మాత్ర చూర్ణం చేసి నీటిలో కలిపి ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఒకటి నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలందరూ వైద్యుల పర్యవేక్షణలోనే ఈరోజు మాత్రలు వేయనునట్లు తెలిపారు. ఈరోజు తప్పిపోయిన పిల్లలకు రేపటినుండి 19వ తేదీ వరకు అంగన్వాడి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇల్లు తిరిగి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం బోదకాలు నివారణ డీఈసీ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది ఇచ్చే మాత్రలను ప్రతి ఒక్కరు వేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి నాగ నిర్మల, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
1 నుండి 19 సంవత్సరాలలోపు వారందరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: August 11, 2025 7:00 pm