*బాల్యంలో చేసిన పనులను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు*
*జమ్మికుంట, మార్చి 23 ప్రశ్న ఆయుధం*
బాల్యంలో చదువుకున్న విద్యార్థులందరూ కలుసుకొని బాల్యంలో చేసిన పనులను గుర్తు చేసుకున్నారు ఆదివారం రోజున జమ్మికుంట ఆబాది జడ్పీ హైస్కూల్ లో 1990- 91 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఒక ఫంక్షన్ హాలు లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు బాల్యం నాటి పనులను జ్ఞాపకాలను విద్యార్థులు గుర్తు చేసుకున్నారు బాల్యంలో చేసిన చిలిపి పనులు చేసుకుంటూ ఆనంద లోకంలో విహరించారు బాల్యం అనేది తిరిగి రానిదని ఏ వయసులో చేసే పనులు ఆ వయసులో చేయాలని ఒకరికొకరు అనుకున్నారు నేటి విద్యా వ్యవస్థలో గురువులకు విద్యార్థులకు దూరం పెరుగుతుందని గురువుల పట్ల విధేయత ప్రస్తుత కాలంలో ఉండడం లేదని వాపోయారు అప్పటి గురువులైన రామాచారి,కైలాసం,గంగాధర్ లను సన్మానించారు ఉన్నత స్థాయిలో ఉన్న విద్యార్థులను అభినందించారు. పద్మ, ఉదయభాస్కర్, శ్రీనివాసరావు, తిరుపతి, వెంకటేశ్వర్లు, తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.