పదవ తరగతి టాలెంట్ టెస్ట్ నిర్వహించన పూర్వ విద్యార్థులు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి, బీబీపెట్
తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి బాలుర ఉన్నత పాఠశాల బిబిపేటలో ఆదివారం 2003 – 2004 ఎస్ఎస్సి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు పదవ తరగతి టాలెంట్ టెస్ట్ నిర్వహించరు. ఈ టాలెంట్ టెస్ట్ కు మండలంలోని ఐదు పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు 109 మంది పాల్గొన్నారు. టాలెంట్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందించరు. ఇందులో తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి ఉన్నత పాఠశాల బీబీపేట కు చెందిన పదవ తరగతి విద్యార్థిని కుమారి అక్షయ ప్రథమ స్థానం సాధించి 3000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని అందుకున్నరు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మూల రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందం కుమారి అక్షయను అభినందించారు.