సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): అంగన్వాడీ కేంద్రాలను పిల్లలకు మొదటి పాఠశాలలుగా మార్చాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రీస్కూల్ బోధనా విధానాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రీ ప్రైమరీ విద్య కోసం తమ పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలలో చేర్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. ఎవరు కూడా ప్రీ ప్రైమరీ విద్య కోసం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్చకుండా అంగన్వాడీ కేంద్రాల్లోనే చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు మెరుగైన ప్రీ ప్రైమరీ విద్య అంగన్వాడి కేంద్రాల్లోనే లభిస్తుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే అంగన్వాడీ కేంద్రాలకు తల్లిదండ్రులకు నమ్మకం పెంచాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే భోజనాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పిల్లలకు ఇచ్చే ఆహారం మెనూ ప్రకారం ఉండాలన్నారు ప్రతి చిన్నారికి అవసరమైన పోషకాహారం అందించాల్సిన బాధ్యత అంగన్వాడి సిబ్బంది పై ఉందన్నారు. ప్రతి అంగన్వాడి కేంద్రంలో ప్రీ ప్రైమరీ విద్య బోధనలు బోధన ప్రమాణాలు మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవాలని, పిల్లల అభివృద్ధిపై అసెస్మెంట్ కార్డులలో విద్యార్థుల ప్రగతిని నమోదు చేయాలని చదువులో వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.
అంగన్ వాడీ కేంద్రాలను పిల్లలకు మొదటి పాఠశాలలుగా మార్చాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: August 5, 2025 7:14 pm