ఎండీఆర్ ఫౌండేషన్‌కు మరో అవార్డు

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ బాచుపల్లి ఎస్ వీఎం గ్రాండ్ హోటల్‌లో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేమ్ చేంజర్ అవార్డు 2025 కార్యక్రమంలో ఎండీఆర్ ఫౌండేషన్‌ కు గేమ్ చేంజర్ అవార్డును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు సుధన్ సంస్థ తరఫున అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ప్రోత్సాహం మరియు కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ సహకారంతో ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఫౌండేషన్ చేపట్టిన ముఖ్యమైన సేవలలో గుర్తు తెలియని మృతదేహాల దహన కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, ఆర్థికంగా బలహీనులైన విద్యార్థులకు విద్యా సహాయం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, అలాగే ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక, నిత్యావసర సరుకులు, మానసిక మద్దతు వంటి సేవలు ఉన్నాయని అన్నారు. ఈ అవార్డు మా సేవా కార్యక్రమాల పట్ల సమాజం చూపిన అంగీకారానికి నిదర్శనం అని, ఇది మా బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాపయోగ సేవలతో ముందుకు సాగుతామని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment