ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. వివిధ శాఖలు రూపొందించిన నూతన పాలసీలపై ప్రభుత్వ శాఖలు ఇచ్చిన కీలక ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో పునరుద్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వనరుల వినియోగం పెంచేలా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.