గ్రామ పంచాయతీ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారుల నియామకం

గ్రామ పంచాయతీ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారుల నియామకం

పారదర్శక ఎన్నికల నిర్వహణకు శాఖలు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 21: 

 

గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు–2025కు సంబంధించి జిల్లాలోని కీలక ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాలు జారీ చేశారు. శిక్షణ, రవాణా, భద్రత, మౌలిక వసతులు, కమ్యూనికేషన్, వ్యయ పర్యవేక్షణ వంటి విభాగాలకు అధికారులు నోడల్‌లుగా నియమితులయ్యారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈఓ చందర్ తదితరులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాల పరిశీలన, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, తాగునీరు, విద్యుత్, ర్యాంపులు సహా మౌలిక సదుపాయాలను సమయానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో లైన్ విభాగాధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment