మెదక్/నర్సాపూర్, మార్చి 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ పనులను అరుణ్ గురుస్వామి పరిశీలించారు. అయ్యప్ప, అమ్మవారి ఆలయాల నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా మండపం, 18 మెట్లు, స్వాముల కోసం ఏర్పాటు చేస్తున్న గదులు, హాల్ పనులను అడిగి తెలుసుకున్నారు. అతి తక్కువ కాలంలో ఎంతో వైభవంగా అయ్యప్ప స్వామి దేవాలయం కొండలు, గుట్టల మధ్యన చెరువు పక్కన గల దేవాలయాన్ని పరిసరాలు చూసి ఈ దేవాలయం అతి త్వరలో ప్రారంభం అవుతుందని, ఈ మందిరం తెలంగాణలోనే పవిత్ర దేవాలయంగా వెదజల్లుతోందని తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్ గురు స్వామిని అయ్యప్ప సేవా సమితి నాయకులు శాలువాతో సన్మానించారు. వీరితో పాటు రమణ గురుస్వామి, శ్రీకాంత్ గురు స్వామి, శంకర్ గురుస్వామి, నరేందర్ గౌడ్ గురుస్వామి, మురళీ గురుస్వామి వచ్చారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్, రాములు గుప్త, రమేష్ గౌడ్, దేవాగౌడ్, నాగరాజు, అశోక్ గౌడ్, వేణుచారి, మహేష్ గుప్తా, నరసింహులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ యాదవ్, గోపాల్ రెడ్డి, సుధాకర్ గుప్త, అయ్యప్ప విగ్రహ దాత వెంకటేష్, మహేష్ చారి, మురళి, అయ్యప్ప సేవా సమితి నాయకులు పాల్గొన్నారు.