సంగారెడ్డి జిల్లాకు నవోదయ విద్యాలయం కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు: బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్‌రాజ్ శేరికార్

విద్యాలయం
Headlines :
  1. సంగారెడ్డి జిల్లాకు నవోదయ విద్యాలయం కేటాయించిన ప్రధాని మోదీకి అరుణ్‌రాజ్ శేరికార్ ధన్యవాదాలు
  2. తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు: బీజేపీ నాయకుడు అరుణ్‌రాజ్ శేరికార్ సంతోషం వ్యక్తం
  3. నవోదయ విద్యాలయాలు: 28 స్కూల్స్ ద్వారా 15,680 విద్యార్థులకు శిక్షణ మరియు ఉపాధి

సంగారెడ్డి/నారాయణఖేడ్, డిసెంబరు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాకు నవోదయ విద్యాలయం కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్‌రాజ్ శేరికార్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం అరుణ్‌రాజ్ శేరికార్ మాట్లాడుతూ..భారత దేశం లో 7 రాష్ట్రాలలో 28 నవోదయ విద్యాలయాలకు ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని అన్నారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు ఇచ్చారని, అందులో సంగారెడ్డి జిల్లాకు కేటాయించటం హర్షణీయమని అన్నారు. సంగారెడ్డి జిల్లాకు కేటాయించిన నవోదయ విద్యాలయాన్ని నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని అరుణ్‌రాజ్ శేరికార్ కోరారు. మిగత 6 నవోదయ విద్యాలయాలు తెలంగాణలో జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మెహబూబ్ నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఒక్కొక్క నవోదయ విద్యాలయంలో 47 మందికి ఉపాధి కల్పిస్తున్నదని, మొతం 28 వివిధ విద్యాలయాల ద్వారా 1,316 మందికి ప్రత్యక్ష శాశ్వత ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. ఒక్కో స్కూల్ లో 560 మంది విద్యార్థులను చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 28 నవోదయ విద్యాలయాల ద్వార 15,680 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అరుణ్‌రాజ్ శేరికార్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now