సంగారెడ్డి/నారాయణాఖేడ్, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిని జిల్లా కార్యదర్శి అరుణ్‌రాజ్ శేరికార్ ఘనంగా సన్మానించారు. సోమవారం వారి నివాసంలో గోదావరి అంజిరెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా కార్యదర్శి బాధ్యతలు తనకు అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బిజెపి సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిని సన్మానించిన అరుణ్‌రాజ్
Published On: August 19, 2025 11:41 am