మెదక్/నర్సాపూర్ మార్చి 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో హైదరాబాద్ టీ ప్యాలెస్, జ్యూస్ పాయింట్ ప్రారంభ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ పాల్గొన్నారు. సోమవారం నర్సాపూర్ లో హైదరాబాద్ టీ ప్యాలెస్, జ్యూస్ పాయింట్ ప్రారంభం కాగా.. మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ హాజరై షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ ను షాపు నిర్వాహకుడు గణేష్ గౌడ్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాని గణేష్ గౌడ్, నాయకులు మురళిగౌడ్, సందు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.