ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండీ రూ 25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాల కోసం షో కాజ్ నోటీసు ఇచ్చి దాన్ని ఉపాసంహరించుకునేందుకు రూ 25 వేలు తన కార్యాలయం విద్యానగర్ లో తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.