నర్సాపూర్, అక్టోబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “అస్తారా 2025” జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రతిభా పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీటీ ముంబై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ.బి. పండిట్ హాజరై పర్యావరణ రక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ పునరుత్పత్తి శక్తుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం “రియాక్ట్-ఓ-కార్” పోటీ ఉత్సాహంగా నిర్వహించగా.. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. గౌరవ అతిథిగా అపిటోరియా ఫార్మా అధ్యక్షుడు రవినాథ్ శెట్టి కెమికల్ ఇంజనీరింగ్ భవిష్యత్తు అవకాశాలను వివరించారు. ప్రిన్సిపల్ సంజయ్ దూబే ఏఐ, ఎంఎల్ సాంకేతికతలు ఇంజనీరింగ్ రంగానికి ఉపయోగకరమని పేర్కొన్నారు. చైర్మన్ కె.వి. విష్ణు రాజు అప్లికేషన్ ఆధారిత అభ్యాసం ప్రాముఖ్యతను వివరించి పాల్గొన్న జట్లను అభినందించారు. రియాక్ట్-ఓ-కార్ పోటీలో బీవీఆర్‌ఐటీ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు మొదటి బహుమతి సాధించారు. ఎస్‌వీఎన్‌ఐటీ సూరత్ బృందం, బీవీఆర్‌ఐటీ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి మరో బృందం వరుసగా రెండవ, మూడవ బహుమతులు గెలుచుకున్నాయి. ఈ కార్యక్రమం డైరెక్టర్ డా.లక్ష్మి ప్రసాద్, విభాగాధిపతులు, అధ్యాపకుల పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు.
బీవీఆర్ఐటీలో ముగిసిన “అస్తారా 2025” జాతీయ స్థాయి ఫైనల్ పోటీలు
Published On: October 21, 2025 7:14 pm