నర్సాపూర్ బస్టాండ్ వద్ద రోడ్డుపైనే నిలుపుతున్న ఆటోలు..

మెదక్/నర్సాపూర్, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బస్టాండు వద్ద ఆటోలను రోడ్డుపై నిలుపుతుండటంతో ఇతర వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆటోలను ఇష్టానుసారంగా రోడ్డుపై నిలపడంతో ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు కారణమవుతున్నాయి. ఉదయం, సాయంత్రం ఆటో డ్రైవర్లు రోడ్డు నడుమనే వాహనాలను నిలిపేయడం వల్ల ట్రాఫిక్ గందరగోళం నెలకొంటోంది. బస్టాండ్ ప్రాంతానికి వచ్చే బస్సులు, కార్లు, బైక్‌లు వెళ్లే మార్గాలు ఆటోల వల్ల పూర్తిగా అడ్డు పడుతున్నాయి. దీంతో వాహనదారులు రద్దీ సమయంలో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు పలుమార్లు ఆటో డ్రైవర్లను అడిగినప్పటికీ వారు పట్టించుకోకపోవడం లేదని పలువురు పేర్కొన్నారు. బస్టాండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయాలని, ఆటోలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుని, ఆటో పార్కింగ్ నియమాలను అమలు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment