సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జేఎన్‌టీయూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలను గురించి విద్యార్థులకు వివరించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం యువత భవిష్యత్తుకు అడ్డంకిగా మారకూడదని, తల్లిదండ్రులు మీ పై పెట్టికున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తు నిర్మాణంలో దృష్టి సారించాలని అన్నారు. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారం పంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని, మోసపూరిత లింకులు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బాధ్యతగా గల పౌరులుగా ట్రాఫిక్ నిబంధులను పాటింస్తూ.. విధిగా హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జేఎన్‌టీయూ విద్యార్థులకు అవగాహన: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: October 10, 2025 6:06 pm