పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం

సంగారెడ్డి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో స్థానిక ఇందిరానగర్ హెల్త్ సెంటర్ సహకారంతో పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ విభాగాలు రెండు, మూడు, నాలుగుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈనెల12, 13, 14 తేదీలలో పోలియో వ్యాధి నివారణకై నిర్వహిస్తున్నాయని, అందులో భాగంగా తమ విద్యార్థులు 5 సంవత్సరాల లోపు బాల బాలికలకు పోలియో చుక్కలను వేయడానికి వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపిపారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా విచ్చేసిన డాక్టర్ శశికర్ పోలియో చుక్కలు ఏ విధంగా వేయాలి, వేసే విధానము, ఎవరికి వేయాలి అనే విషయాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల విద్యార్థులు సంగారెడ్డి పట్టణములోని ఐదు సంవత్సరాల లోపు బాలబాలికలకు పల్స్ పోలియో చుక్కలను వేస్తారని, విద్యతో పాటు సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కళాశాల తరఫున నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెల్త్ సెంటర్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ సదయకుమార్, డాక్టర్ వాణి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment