సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబర్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటి గ్రామ దుర్గామాత ఆలయంలో పటాన్ చెరు బీఆర్ఎస్ యువ నాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహించిన అన్నదానం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిచరణ్ గౌడ్ మాట్లాడుతూ.. అన్నదానం అన్నది అత్యంత పుణ్యకార్యాలలో ఒకటి అని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దుర్గామాతను దర్శించుకున్న బాలగౌని సాయిచరణ్ గౌడ్
Published On: September 26, 2025 8:41 pm