Headlines :
-
టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు బండారు యాదగిరి సన్మానం
-
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం పొందిన బండారు యాదగిరి
-
సంగారెడ్డిలో టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సన్మాన కార్యక్రమం
సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీయూడబ్ల్యూజే- ఐజేయు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణస్వీకారం వైకుంఠపురం శివారు వాసవి మహాసంస్థాన్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా టీయుడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షుడు బండారు యాదగిరిని శాలువా కప్పి సత్కరించి, మేమెంటో అందజేశారు. సంఘానికి, జర్నలిస్టుల సంక్షేమానికి పాటు పడుతున్నందుకు అభినందించారు. వాసవి మాత ఆశీస్సులతో మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బండారు యాదగిరి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మునిగాల మాణిక్ ప్రభు, నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి నామాభాస్కర్, కోశాధికారి ఆమెటి భాస్కర్, పూర్వ అధ్యక్షుడు పాంపాటి కృష్ణమూర్తి, ఆమెటి పాండయ్య, వాసవి క్లబ్ ముఖ్యులు చందా శ్రీధర్ పుల్లూరు ప్రకాష్ ఇరుకుల ప్రదీప్, కుందారం రాజయ్య, ఆమేటి మహేందర్ పుట్నాల లక్ష్మణ్, తహసిల్దార్ సతీష్, మాచర్ల సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.