సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డిలోని ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా జడ్జి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురిలు హాజరయ్యారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే, పువ్వులను పూజిజే ప్రత్యేక సంస్కృతి అని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు బతుకమ్మ, విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ రావు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, డివిజన్ పోలీసు అధికారులు, ఇన్స్ పెక్టర్, సబ్- ఇన్స్ పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పోలీసు కుటుంబం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
Published On: September 27, 2025 9:37 pm