సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల జనాభా దామాషా ప్రకారం 42శాతం రిజర్వేషన్లు పెంచడం పట్ల కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు లేకుండా చేశారని, తాము అధికారంలోకి వస్తే బీసీ కుల గణనతో పాటు బీసీ రిజర్వేషన్లు పెంచుతామని నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ లో తెలిపారని, అలా ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే నేడు బీసీ కుల గణన చేయాడంతో పాటు బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో తీసుకురావడం బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని అర్దం చేసుకోవాలని అన్నారు.
బీసీ రిజర్వేషన్లు పెంపు హర్షనీయం: పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్
Published On: September 26, 2025 9:30 pm