సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీ రిజర్వేషన్ల సాధనకై ఈ నెల 18న తలపెట్టిన బీసీ జేఏసీ బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డి ఐబీలో బీసీ సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న శక్తులకు గట్టి సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. బీసీ కులాలు తమ కులవృత్తులను బంద్ రోజున నిర్వహించకుండా నిరసన తెలిపి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. అన్ని బీసీ కుల సంఘాల సమన్వయంతో ఉద్యమ కార్యాచరణను ప్రకటించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రభుగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గోకుల్ కృష్ణ, సురేందర్ న్యాయవాది, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, సలహాదారులు చంద్రయ్య స్వామి న్యాయవాది, కార్యదర్శి సంగమేశ్వర్, శ్రీనివాస్, శాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిలు, యువజన సంఘం అధ్యక్షుడు కూన వేణు, మద్దికుంట కొండయ్య, మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజులగౌడ్, వీరమణి, మంగ గౌడ్, జావిద్, కుమ్మరి గోపాల్, శివకుమార్, పవన్ కుమార్, ఆంజనేయులు, పల్లె కృష్ణమూర్తి, ఆర్టీసీ గోరుగంటి రమేష్ యాదవ్, రమేష్ గౌడ్, మహేంద్ర, మహేష్ కుమార్, రాందాస్, బలరాం, రమేష్, సాయిలు, చాకలి రవి, నరసింహులు, మేకం ఆంజనేయులు, ఈశ్వర్ గౌడ్, యాదగిరి తదితర బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ నెల 18న బీసీ జేఏసీ బంద్ ను విజయవంతం చేయాలి: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్
Published On: October 14, 2025 8:08 pm