సంగారెడ్డి ప్రతినిధి, జూలై 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు జూలై 4వ తేదీన శుక్రవారం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ అధికారి జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10గంటలకు సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని బీసీ సంక్షేమ అధికారి జగదీష్ పిలుపునిచ్చారు.
ఈనెల 4న దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు: బీసీ సంక్షేమ అధికారి జగదీష్
Updated On: July 3, 2025 7:00 pm
