*అభినందించిందిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు*
*తిమ్మాపూర్ గ్రామ మార్కండేయ భజన మండలి ఘనత*
మెదక్/గజ్వేల్, జూలై 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): భక్తి శ్రద్దలతో భగవంతుణ్ణి కీర్తించేందుకు, స్మరించేందుకు ఏర్పాటు చేసుకున్నదే భజన. ఈ భజన 100 వారాల పాటు 20మంది భక్తులు జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమని భక్త బృందాన్ని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు 20 భక్తులకు శుక్రవారం దేవాలయంలో సీతారాముల ఫొటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భగవంతునికి సేవకు మించిన సంపద ప్రపంచంలో మరొకటి లేదన్నారు. భక్తిశ్రద్దలతో 100 వారాలు భజన చేయడం అభినందనీయం అన్నారు. సన్మాన గ్రహీతలు అర్చకులు నక్క ప్రదీప్ శాస్త్రి, హనుమండ్ల కనకయ్య, తలకొక్కుల సత్యనారాయణ, కొంతం లక్ష్మణ్, దేవసాని ప్రభాకర్, వీరబత్తిని ఉప్పలయ్య, వేముల ఐలయ్య, దేవసాని నరేందర్, వడ్లకొండ కిష్టయ్య, తలకొక్కుల వెంకటేశం, కమ్మరి వెంకటేశం, నాయిని మహేందర్, తలకొక్కుల శ్రీశైలం, వీరబత్తిని మల్లేశం, దండు కొండయ్య, అల్లం ఆంజనేయులు, వీరబత్తిని చక్రపాణి, వీరబత్తిని కుమార్, దండు కొండయ్య, మెండే నర్సయ్య, దండు యాదగిరి సన్మానించారు.