మెదక్/గజ్వేల్, జూలై 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈ నెల 24న భద్రాచల దేవస్థానంలో శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రాన్ని (పునర్వసు) పురస్కరించుకొని గురువారం ఉదయం 6గంటలకు భద్రాచల దేవస్థానం ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షణ ఉంటుందని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు తెలిపారు. ఈ దైవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని సీతారాముల కృపకు పాత్రులు కావాలన్నారు. రామ నామం అజెయమైందని శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయన్నారు. రామ నామాన్ని మించిన నామం మరొకటి లేదన్నారు.
24న భద్రాచలంలో భద్రగిరి ప్రదక్షిణలో పాల్గొనండి: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
Published On: July 21, 2025 5:30 pm
