జీవశాస్త్ర విజ్ఞానం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఉండాలి: తెలంగాణ బయో సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు డి.ప్రసన్న కుమార్

సైన్స్
Headlines
  1. నర్సాపూర్ బయో సైన్స్ టాలెంట్ టెస్టులో ప్రథమ, ద్వితీయ స్థానం విజేతలు
  2. డి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ జీవశాస్త్రం ఆరోగ్యానికి, అభివృద్ధికి ఎంత కీలకమో
  3. మండల స్థాయి టాలెంట్ టెస్టులో నబీర, అరవింద్, మేఘన విజేతలు
  4. బయో సైన్స్ టాలెంట్ టెస్టు ద్వారా విద్యార్థుల సుస్థిర అభివృద్ధికి నిధులు
  5. నర్సాపూర్: భవిష్యత్తుకు శాస్త్రీయ ఆలోచనల ప్రోత్సాహం

మెదక్/నర్సాపూర్, డిసెంబరు 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమాజంలో ప్రతి విద్యార్థి మరియు పౌరునికి, జీవశాస్త్ర విజ్ఞానం, పర్యావరణ పరిరక్షణ పట్ల చాలా అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ బయోసైన్స్ ఫోరం (టీబీఎస్ ఎఫ్) జిల్లా అధ్యక్షుడు డి.ప్రసన్న కుమార్ తెలిపారు. సోమవారం నర్సాపూర్ మండల స్థాయి బయో సైన్స్ టాలెంట్ టెస్టు నర్సాపూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్టు నిర్వహణకు ముఖ్య అతిథులుగా టీబీఎస్ ఎఫ్) జిల్లా అధ్యక్షుడు డి.ప్రసన్న కుమార్, మండల ఎంఈఓ తారసింగ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, టీబీఎస్ ఎఫ్ నర్సాపూర్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీబీఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో తమ ఆరోగ్యం, జీవన విధానం, సుస్థిర అభివృద్ధి, సుస్థిర పర్యావరణ స్పృహ, శాస్త్రీయ ఆలోచన, శాస్త్రీయ అవగాహన, కలిగి ఉండడానికి, జీవశాస్త్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈనాడు జీవశాస్త్రం ఎన్నో శాఖలుగా అభివృద్ధి చెంది, కొత్త కొత్త ప్రయోగాలతో, అధునాతన సాంకేతిక విజ్ఞానంతో, చాలా రంగాలలో ముందుకెళ్తుందని అన్నారు. మండల స్థాయి టాలెంట్ టెస్టు ఇంగ్లీష్ మీడియం విభాగంలో నబీర తాజ్మిన్ (జడ్.పి.హెచ్.ఎస్, నర్సాపూర్) ప్రథమ స్థానం, ఏ.హర్ష. (టీజీ ఎంఎస్ జక్కపల్లి ) ద్వితీయ స్థానం, తెలుగు మీడియం విభాగంలో ఎన్. అరవింద్, (జడ్.పి.హెచ్.ఎస్ బ్రాహ్మణ పల్లి ) ప్రథమ స్థానం, వి. మేఘన (జడ్.పి.హెచ్.ఎస్ -చిన్న చింతకుంట) ద్వితీయ స్థానంలో నిలిచారు. మండల స్థాయి ప్రథమ ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు డిసెంబరు 18వ తేదీన జిల్లా స్థాయి జీవశాస్త్ర టాలెంట్ పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం విఠల్, పిఆర్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్య నాయక్, టీబీఎస్ ఎఫ్ జిల్లా బాద్యులు అరుణ, వెంకట్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now