టీజేయూ ఆధ్వర్యంలో డా.భరత్‌కుమార్‌ శర్మ జన్మదిన వేడుకలు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ (టీజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ఐఎఫ్‌డబ్ల్యూజే కార్యదర్శి డా. భరత్‌కుమార్‌ శర్మ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్‌ వద్ద ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన టీజేయూ 14వ రాష్ట్ర వార్షికోత్సవ మహాసభలో భాగంగా డా. భరత్‌కుమార్‌ శర్మ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌డబ్ల్యూజే ఉపాధ్యక్షుడు డా. పెద్దాపురం నరసింహ, రాష్ట్ర కార్యదర్శులు సిహెచ్‌ శ్రీనివాస్‌, సంగారెడ్డి ఇన్‌చార్జ్‌ బాపురావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లాధ్యక్షులు వల్లపు శ్రీనివాస్‌, కృష్ణమూర్తి, రామయ్య, షానూర్‌ బాబా, ప్రసాద్‌, సుదర్శన్‌, సిద్ధల రవి, రమేష్‌ గౌడ్‌, గండ్ర నరేందర్‌, ఫసియోద్దీన్‌, గుడాల శేఖర్‌, శ్రీకాంత్‌, సాగర్‌, శ్రీనివాస్‌, బైరి ప్రభాకర్‌, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment